Saffron cultivation in Hyderabad: అందాల కశ్మీర్ లోయకే పరిమితమైన సుగంధ ద్రవ్యాల్లో రారాణిగా భావించే కుంకుమపువ్వు.. ఇప్పుడు చారిత్రక ప్రసిద్ధిగాంచిన భాగ్యనగరంలోనూ విరబూస్తోంది. ఈ అసాధ్యమైన విషయాన్ని హైదరాబాద్‌కు చెందిన అర్బన్ కిసాన్ అంకుర సంస్థ సుసాధ్యం చేసి ఔరా అనిపిస్తోంది.
హైడ్రోపోనిక్స్ పద్ధతిలో పెంచిన కుంకుమపువ్వు మొక్కలు
అర్బన్ కిసాన్ సంస్థ నిర్వాహకులు కశ్మీర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ శాఫ్రాన్ రీసెర్చ్‌ను.. సంస్థ ప్రతినిధులు సందర్శించి మొక్కలు(saffron in hyderabad) పెరగడానికి అనువైన వాతావరణం, తేమ, కార్బన్ డయాక్సైడ్, పోషకాలు ఎలా ఉండాలనే వివరాలు సేకరించారు. క్వింటా రూ.18 వేల చొప్పున 1.5 క్వింటాళ్ల విత్తనాలను కొనుగోలు చేశారు. ఆగస్టు నుంచి వర్టికల్ విధానంలో హైడ్రోపోనిక్స్(hydroponics process) పద్ధతిలో చేపట్టిన పెంపకంలో 14వేల మొక్కలు పెరిగాయని నిర్వాహకులు తెలిపారు. తొలిదశ ప్రయోగం విజయవంతం అవడంతో రెండో దశలో ఇక్కడే విత్తనాల ఉత్పత్తికి ప్రయత్నిస్తున్నారు.