తెలంగాణ రాష్ట్రం నాగర్కర్నూల్ జిల్లా దిండి ప్రాజెక్టు వరద ఉద్ధృతిలో చిక్కుకున్న భార్యభర్తలను ఎన్డీఆర్ఎఫ్ బృందం రక్షించింది. అచ్చంపేట మండలం సిద్దాపూర్ వద్ద దిండి ప్రాజెక్టు ఉద్ధృతిలో చిక్కుకున్న వెంకట్ రాములు, విజ్జి దంపతులను ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రెస్క్యూ చేసి కాపాడారు. దంపతులు ప్రవాహంలో చిక్కుకుపోయిన విషయం తెలుసుకున్న కలెక్టర్ శర్మన్, ఎస్పీ సాయి శేఖర్ హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలను ముమ్మరం చేశారు.
హమ్మయ్యా... వారిని కాపాడారు! - వరద పొటెత్తుతున్న దిండి ప్రాజెక్టు
దిండి ప్రాజెక్టు వరద ఉద్ధృతిలో చిక్కుకుపోయిన దంపతులు సురక్షితంగా బయటపడ్డారు. వీరిని ఎన్డీఆర్ఎఫ్ బృందం కాపాడింది. భార్యాభర్తలు సురక్షితంగా బయటపడగా ప్రజలు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
సురక్షితంగా బయటపడిన దంపతులు
రాత్రి 10 గంటలకు 2 ఎయిర్ బోట్లు, లైటింగ్ బెలూన్, ఎయిర్ బ్యాగుల సహయంతో దంపతులను వెతికారు. సుమారు రెండు గంటల తరువాత సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. భార్యాభర్తలు బయటపడగా ప్రజలు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
ఇదీ చదవండి:జింకల వేటగాళ్లను అరెస్ట్ చేసిన పోలీసులు