హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లో సదర్ ఉత్సవాలు కోలాహలంగా నిర్వహించారు. దీపావళి మరుసటి రోజు సదర్ ఉత్సవం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఖైరతాబాద్ గ్రంథాలయ చౌరస్తా నుంచి... రైల్వేగేటు వరకు ఉత్సవం నిర్వహించారు. ఈ వేడుకకు నగరం నలుమూలల నుంచి 50 దున్నరాజులు తరలివచ్చాయి.
హైదరాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు - sadar festival in hyderabd
హైదరాబాద్ నగరంలో సదర్ ఉత్సవాలతో కోలాహలం నెలకొంది. ఖైరతాబాద్‌లో జరుగుతున్న వేడుకలను తిలకించేందుకు ప్రజలు భారీసంఖ్యలో తరలివచ్చారు. ఈ సంబురాల్లో ప్రముఖులు పాల్గొని సందడి చేశారు.
హైదరాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు
వేడుకలను తిలకించేందుకు నగరవాసులు భారీగా తరలివచ్చారు. వేడుకల్లో దున్నపోతుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. వేడుకల్లో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అనిల్‌కుమార్ పాల్గొన్నారు. అనిల్‌కుమార్ యాదవ్ దున్నపోతులపై ఎక్కి నృత్యం చేశారు. నారాయణగూడలోనూ... సదర్ ఉత్సవాలు ఘనంగా జరిగాయి.
ఇదీ చూడండి: పోలవరం ఎత్తు అంగుళం కూడా తగ్గించడం లేదు: మంత్రి అనిల్