'రైతు కోసం తెలుగుదేశం' కార్యక్రమాన్ని ఈ నెల 13వ తేదీ నుంచి కాకుండా.. 14వ తేదీ నుంచి మొదలుపెట్టనున్నట్లు తెదేపా ప్రకటించింది. వైకాపా పాలనలో రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజల్లో ఎండగట్టేందుకు ఈ నెల 14 నుంచి 18వ తేదీ వరకు రైతు వ్యతిరేక నిరసనలు చేపట్టనున్నట్లు వెల్లడించింది.
ఈ నెల 14 నుంచి 'రైతు కోసం తెలుగుదేశం' - రైతు కోసం తెలుగుదేశం కార్యక్రమం వాయిదా
'రైతు కోసం తెలుగుదేశం' కార్యక్రమం షెడ్యూల్‌లో మార్పు చేశారు. ఈ నెల 13న ప్రారంభం కావాల్సి ఉండగా.. నూతన షెడ్యూల్ ప్రకారం 14 నుంచి నిరసనలు చేపట్టనున్నట్లు తెదేపా ప్రకటించింది.
రాష్ట్రాన్ని 5 జోన్లుగా విభజించి ఒక్కో రోజూ ఒక జోన్లో 5 పార్లమెంట్ స్థానాల్లో 35అసెంబ్లీ నియోజకవర్గాల ప్రతినిధులు నిరసన తెలిపేలా కార్యాచరణ రూపొందించారు. 14వ తేదీన నంద్యాల, కర్నూలు, అనంతపురం, హిందూపురం, కడప పార్లమెంట్ స్థానాల్లో నిరసనలు తెలపనున్నారు. 15వ తేదీన కాకినాడ, అమలాపురం, రాజమండ్రి, నరసాపురం, ఏలూరు పార్లమెంట్ల పరధిలో నిరసనలు చేయాలని నిర్ణయించారు. 16వ తేదీన ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, రాజంపేట, చిత్తూరు పార్లమెంట్ స్థానాల్లో .. 17వ తేదీన అరకు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఆందళన చేపట్టనున్నారు. 18వ తేదీన మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, నర్సరావు పేట, బాపట్ల పార్లమెంట్ స్థానాల్లో నిరసనలు చేయాలని తెలుగుదేశం నిర్ణయించింది.
ఇదీ చదవండి:సరుగుడు మొక్కల పెంపకంపై కుదరని సయోధ్య.. కొనసాగుతున్న 144 సెక్షన్