రాష్ట్రవ్యాప్తంగా వైయస్‌ఆర్ రైతు భరోసా-పీఎం కిసాన్ పథకం ఘనంగా ప్రారంభమైంది.రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది..రైతుకు భరోసా ఉంటేనే రాష్ట్రం బాగుంటుందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు.కర్నూలు జిల్లా డోన్ సాయి ఫంక్షన్ హాల్ లో రైతు భరోసా కార్యక్రమంలో ఆర్ధికమంత్రి బుగ్గన పాల్గొన్నారు.చిత్తూరు జిల్లా నగరిలో వైయస్‌ఆర్ రైతు భరోసాను ఎమ్మెల్యే రోజా ప్రారంభించారు.ప్రధానమంత్రి కిసాన్ యోజనతో కలిపి...ప్రతి రైతుకు13వేల500రూపాయలు ఇస్తున్నట్లు తెలిపారు.మదనపల్లిలో ఎమ్మెల్యే నవాజ్ బాషా ప్రారంభించారు.గత ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందన్న ఆయన ఆర్ధిక ఇబ్బందుల నుంచి రైతులను కాపాడేందుకే ముఖ్యమంత్రి ఈ పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు.
కర్నూలు రైతు భరోసా అమలు కార్యక్రమంలో ఆర్థిక మంత్రి - పీఎం కిసాన్ పథకం
రాష్ట్రవ్యాప్తంగా వైయస్‌ఆర్ రైతుభరోసా- పీఎం కిసాన్ పథకం ఘనంగా ప్రారంభమైంది. చిత్తూరు నగరిలో రోజా..కర్నూలు డోన్ లో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పథకాన్ని ప్రారంభించారు.
![కర్నూలు రైతు భరోసా అమలు కార్యక్రమంలో ఆర్థిక మంత్రి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4758173-thumbnail-3x2-rythu.jpg)
విశాఖ జిల్లా నర్సీపట్నంలో ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ రైతు భరోసాను ప్రారంభించారు.పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ ముఖ్యమంత్రి అమలు చేస్తారన్నారు.శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో ఈ పథకాన్ని ఎమ్మెల్యే రెడ్డి శాంతి ప్రారంభించారు.అర్హులైన రైతులకు చెక్కులు పంపిణీ చేశారు.కర్నూలు జిల్లా పత్తికొండలో ఎమ్మెల్యే శ్రీదేవి చెక్కులను పంపిణీ చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ రైతు భరోసా అందుతుందని తెలిపారు. కృష్ణా జిల్లా మైలవరంలో ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రాసాద్ ఈ పథకాన్ని అట్టహాసంగా ప్రారంభించారు. ఎడ్లబండిపై సభాస్థలికి చేరుకుని రైతులనుద్దేశించి ప్రసంగించారు. ప్రతి రైతు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.