ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ: ఈనెల 27 నుంచి జనవరి 7 వరకు రైతుబంధు సాయం: కేసీఆర్​

తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 27 నుంచి వచ్చే నెల ఏడు వరకు రైతులకు... రైతుబంధు సాయాన్ని అందిస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. రైతుబంధు సాయం పంపిణీకి అనుసరించాల్సిన విధానంపై చర్చించి, కార్యాచరణను ఖరారు చేశారు.

rythu bandhu from december 27th to January 7th CM kcr
తెలంగాణలో ఈనెల 27 నుంచి జనవరి 7 వరకు రైతుబంధు సాయం: కేసీఆర్​

By

Published : Dec 7, 2020, 8:14 PM IST

తెలంగాణ రాష్ట్రంలో రైతుబంధు సాయాన్ని ఈ నెల 27 నుంచి వచ్చే నెల ఏడు వరకు రైతులకు అందిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. యాసంగి సీజన్ రైతుబంధు సాయం పంపిణీపై ప్రగతి భవన్​లో సీఎం సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ రావు, వ్యవసాయ శాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

రైతుబంధు సాయం పంపిణీకి అనుసరించాల్సిన విధానంపై చర్చించి, కార్యాచరణను ఖరారు చేశారు. రాష్ట్రంలోని అన్నదాతలందరికీ సాయం అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. రైతుల ఖాతాలోనే నేరుగా డబ్బులను జమ చేయాలని స్పష్టం చేశారు. ఇందుకోసం కోసం రూ.7,300 కోట్లు విడుదల చేయాలని ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు.

తక్కువ విస్తీర్ణం కలిగిన రైతుల నుంచి మొదలుపెట్టి, ఎక్కువ విస్తీర్ణం కలిగిన రైతుల వరకు అందరికీ పది రోజుల వ్యవధిలో డబ్బులు జమ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు.

ఇదీ చదవండి :

మత్స్య ఎగుమతుల్లో దేశం తొలి స్థానానికి చేరాలి: ఉపరాష్ట్రపతి

ABOUT THE AUTHOR

...view details