ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన మూడో దశలో ఆంధ్రప్రదేశ్‌కు 3 వేల 285 కిలోమీటర్ల రహదారి నిర్మాణ లక్ష్యాన్ని నిర్ధేశించినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ పేర్కొంది. 6 వేల 135 కిలోమీటర్లకు పెంచాలని ఏపీ ప్రభుత్వం కోరినప్పటికీ.. అంగీకరించడం సాధ్యంకాదని గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ పార్లమెంటుకు తెలియజేశారు. పీఎంజీఎస్‌వై మూడో దశలో భాగంగా.. గ్రామీణ ప్రాంతాల్లోని మార్కెట్ యార్డులు, ఉన్నత విద్యా పాఠశాలలు, ఆసుపత్రులను అనుసంధానం చేయనున్నట్లు తెలిపారు. అందుకోసం దేశంలో లక్షా 25 వేల కిలోమీటర్ల రహదారులు నిర్మించనున్నట్లు మంత్రి చెప్పారు.
రాష్ట్రంలో 3 వేల 285 కి.మీ.ల రహదారి నిర్మాణానికి ఆమోదం - నరేంద్ర సింగ్ తోమర్ తాజా వార్తలు
పీఎంజీఎస్‌వై మూడో దశలో భాగంగా.. ఆంధ్రప్రదేశ్‌కు 3 వేల 285 కిలోమీటర్ల రహదారి నిర్మాణ లక్ష్యాన్ని నిర్ధేశించినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ తెలిపింది. ఈ పరిమితిని 6 వేల 135 కిలోమీరట్లకు పెంచాలని ఏపీ ప్రభుత్వం కోరినప్పటికీ.. అది సాధ్యంకాదని కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ పార్లమెంటుకు తెలియజేశారు. నేషనల్ సోషియల్ అసిస్టెన్స్ కార్యక్రమం కింద 2020-21లో ఎపీకి రూ. 309.36 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. వీటిని నాలుగు విడతల్లో విడుదల చేసినట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా రాజ్యసభలో వైకాపా సభ్యులు మోపిదేవి వెంకటరమణ, పరిమళ్ నత్వాని అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. మూడో దశ పీఎంజీఎస్‌వైలో భాగంగా రాష్ట్రానికి 3 వేల 285 కి.మీ. లక్ష్యాన్ని నిర్ధేశించినట్లు చెప్పారు. కానీ.. 6 వేల 135 కి.మీ.లకు పెంచాలని ఎపీ ప్రభుత్వం ప్రతిపాదన పంపినట్లు పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాలకు కలిపి 1.25 లక్షల కి.మీ. లక్ష్యానికే కేంద్ర ఆర్ధిక వ్యవహారాల మంత్రివర్గ కమిటీ ఆమోదించినందున.. ఎపీ ప్రభుత్వ ప్రతిపాదనకు అంగీకరించలేకపోయామని స్పష్టం చేశారు.
అన్ని రాష్ట్రాలకు ఒకే రకమైన నిబంధనలు వర్తిస్తాయని మంత్రి అన్నారు. నేషనల్ సోషియల్ అసిస్టెన్స్ కార్యక్రమం కింద 2020-21లో ఆంధ్రప్రదేశ్‌కు రూ. 309.36 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. వీటిని నాలుగు విడతల్లో విడుదల చేసినట్లు వెల్లడించారు.