APSRTC: ఏపీఎస్‌ఆర్టీసీ రాబడిలో 25 శాతం తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలిసింది. ఈ మేరకు అధికారుల కమిటీ నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం అందింది. ఆర్టీసీ ఉద్యోగులు 2020 జనవరి నుంచి ప్రజా రవాణాశాఖ ఉద్యోగులుగా మారారు. వీరికి ప్రభుత్వం నెలకు రూ.300 కోట్ల మేర జీతాల రూపంలో చెల్లిస్తోంది. అయితే ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండటంతో ఆర్టీసీ రాబడిలో కొంత ఇవ్వాలంటూ సర్కారు చాలా రోజులుగా కోరుతోంది. ఎంత మేరకు తీసుకునేందుకు వీలుందో చూడాలని రెండేళ్ల క్రితం సమీక్షలో సీఎం జగన్ ఆదేశించారు. అయితే కొవిడ్ రెండు దశలతో ఆర్టీసీ నష్టాలబాట పట్టింది. రోజువారీ రాబడి గణనీయంగా పడిపోయింది. ఇటీవలే కోలుకొని మళ్లీ గాడిలో పడుతోంది. ప్రస్తుతం ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్) సగటున 75 శాతం వరకు చేరగా, రోజువారీ రాబడి సుమారు రూ.16 కోట్ల వరకు వస్తోంది. దీంతో ఆర్టీసీ నుంచి వాటా తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
APSRTC: ఆర్టీసీ టికెట్ల రాబడిలో.. ప్రభుత్వానికి 25 శాతం?
APSRTC: ఆర్టీసీ టికెట్ల రాబడిలో ప్రభుత్వానికి 25 శాతం చెల్లించనుంది. ఈ మేరకు అధికారుల కమిటీ నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. కొవిడ్‌తో నష్టాల బాటపట్టిన ఆర్టీసీ ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్న క్రమంలో ప్రస్తుతం రోజుకు సుమారు 16 కోట్ల వరకు రాబడి వస్తోంది. దీనిపై ఇప్పటికే పలు దఫాలుగా చర్చలు జరిగాయి. 50 శాతం ఇవ్వాలని ప్రభుత్వం కోరగా ఆర్టీసీ అధికారులు 10 శాతమే ఇస్తామని చెప్పినట్లు తెలిసింది.
తొలుత ఆర్టీసీ రాబడిలో ఎంత తీసుకోవాలనే దానిపై ప్రభుత్వంలోని వివిధ శాఖల అధికారులు, ఆర్టీసీ ఉన్నతాధికారులతో కూడిన కమిటీ పలు దఫాలు చర్చలు జరిపింది. 50 శాతం ఇవ్వాలని ప్రభుత్వం కోరగా.. ఆర్టీసీ అధికారులు 10 శాతమే ఇస్తామని చెప్పినట్లు తెలిసింది. ఆర్టీసీకి నిత్యం వచ్చే రాబడిలో డీజిల్ వ్యయమే అధికంగా ఉంటుందని, తర్వాత బస్సుల నిర్వహణ, స్పేర్స్, టైర్లు తదితరాలకు నిధులు అవసరమని అధికారులు పేర్కొన్నారు. అలా అన్ని విధాలా చర్చలు జరిపిన తర్వాత రాబడిలో 25 శాతం ఇచ్చేందుకు నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అంటే ఆర్టీసీకి ప్రస్తుతం ఉన్న రోజువారీ రాబడి రూ.16 కోట్లలో రూ.4 కోట్ల వరకు ప్రభుత్వం తీసుకోనుంది. ఈ లెక్కన నెలకు రూ.120 కోట్లు, ఏడాదికి రూ.1,440 కోట్లు అవుతుంది. ఆర్టీసీని ప్రభుత్వం లీజుకు తీసుకునే ప్రతిపాదన ఉన్న నేపథ్యంలో.. రాబడి అంతా ప్రభుత్వమే తీసుకొని, అందులో 25 శాతం ఉంచుకొని, మిగిలిన 75 శాతం ఆర్టీసీకి ఇచ్చే విధానం కూడా అమలు చేయవచ్చని చెబుతున్నారు.
ఇవీ చదవండి: