జనతా కర్ఫ్యూ, లాక్‌డౌన్ కారణంగా ప్రయాణాలు రద్దు కావడంతో... ఈ ఏడాది మార్చి 20 నుంచి ఏప్రిల్ 19 మధ్య ఆర్టీసీ బస్సుల్లో వెళ్లేందుకు ముందస్తుగా కొనుగోలు చేసిన టికెట్లకు సంబంధించిన నగదును నేటి నుంచి వెనక్కి ఇవ్వనున్నారు. ఆన్‌లైన్‌లో టికెట్లు తీసుకున్నవారికి గతంలోనే ఆ డబ్బులను వారి ఖాతాల్లో జమ చేశారు. మిగిలినవారు 29వ తేదీలోగా రిజర్వేషన్ కౌంటర్లు, ఏటీబీ కేంద్రాలకు టికెట్లను తీసుకెళ్లి డబ్బులు పొందవచ్చని ఆర్టీసీ ఈడీ (ఆపరేషన్స్) కేఎస్ బ్రహ్మానందరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
నేటి నుంచి ఆర్టీసీ రిజర్వేషన్ టికెట్ల నగదు వెనక్కి - ఆర్టీసీ తాజా వార్తలు
ఆర్టీసీ బస్సుల్లో వెళ్లేందుకు ముందస్తుగా కొనుగోలు చేసిన టికెట్లకు సంబంధించిన నగదును... నేటి నుంచి వెనక్కి ఇవ్వనున్నారు.
![నేటి నుంచి ఆర్టీసీ రిజర్వేషన్ టికెట్ల నగదు వెనక్కి rtc reservation tickects money is retured back from today](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8029511-375-8029511-1594775775696.jpg)
నేటి నుంచి ఆర్టీసీ రిజర్వేషన్ టికెట్ల నగదు వెనక్కి