ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

APSRTC:'ఆర్టీసీకి సొంత బస్సులు కొనే స్థోమత లేదు.. అందుకే అద్దెబస్సులు'

త్వరలో రాష్ట్రంలోకి మరిన్ని అద్దె బస్సులు రానున్నట్లు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. సొంత బస్సులు కొనే స్థోమత ఆర్టీసీకి లేదనందున్న.. కొత్తగా 998 అద్దె బస్సులకు టెండర్లకు పిలిచామన్నారు. అద్దె బస్సుల పెంపుతో ఆర్టీసీ ప్రైవేటు వాళ్ల చేతిల్లోకి వెళ్తుందనేది పూర్తిగా అవాస్తవం అని ఆర్టీసీ ఎండీ స్పష్టం చేశారు.

APSRTC
APSRTC

By

Published : May 4, 2022, 4:26 PM IST

రాష్ట్ర ఆర్టీసీలో అద్దె బస్సులను పెంచుతామని సర్కారు ప్రకటించింది. ఈ మేరకు టెండర్లకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. అద్దె బస్సుల పెంపుతో ఆర్టీసీ ప్రైవేటు వాళ్ల చేతిల్లోకి వెళ్తుందనేది అవాస్తవమని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు స్పష్టం చేశారు. అద్దె బస్సుల పెంపు వల్ల అందుబాటులోకి కొత్త బస్సులు వస్తాయన్నారు. దేశవ్యాప్తంగా రవాణా సంస్థలు సొంత బస్సులు కొని నడిపే పరిస్థితి లేదన్న ఆర్టీసీ ఎండీ.. ఏపీలోనూ అదే పరిస్థితి ఉందన్నారు. అద్దె బస్సుల పెంపు వల్ల ఆర్టీసీకి వాణిజ్యపరంగా లాభమే తప్ప నష్టమేమీ ఉండదన్నారు.

'సొంత బస్సులు కొనే స్థోమత లేదు.. అందుకే అద్దెబస్సులు'

ప్రస్తుతం ఆర్టీసీలో 23 శాతం అద్దె బస్సులున్నాయని.. కొత్తగా మరో 998 అద్దె బస్సులకు టెండర్లు జారీ చేశామని ద్వారకా తిరుమల రావు తెలిపారు. వీటితో కలుపుకుని మొత్తం ఆర్టీసీలో 32 శాతం అద్దె బస్సులు అందుబాటులోకి వస్తాయన్నారు. అద్దె బస్సుల పెంపు వల్ల ఆర్టీసీకి వాణిజ్యపరంగా లాభమేన్నారు. పైగా అద్దె బస్సుల నిర్వహణ, డ్రైవర్‌ జీతభత్యాలంతా బస్సు యాజమాన్యమే చూసుకుంటుందన్నారు.

ఇదీ చదవండి:APSRTC: ప్రైవేటు వైపు వడివడిగా.. ఏపీఎస్‌ఆర్టీసీ అడుగులు !

ABOUT THE AUTHOR

...view details