ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 28, 2020, 12:43 PM IST

ETV Bharat / city

ఏపీఎస్ఆర్టీసీ ఆదాయానికి 'ప్రైవేటు' పంక్చర్!

ప్రైవేటు వాహనాల అక్రమ రవాణా ఏపీఎస్ఆర్టీసీకి శాపంగా మారింది. తెలంగాణతో కుదుర్చుకున్న అంతర్‌రాష్ట్ర రవాణా ఒప్పందం ఆర్టీసీ దూర ప్రాంత సర్వీసుల లాభాలకు బ్రేకులు వేయగా ప్రైవేటు ఆపరేట్లు మరికొంత ఆదాయానికి గండికొడుతున్నారు. ప్రైవేటుకు కళ్లెం వేయకపోతే...సంస్థ గట్టెక్కడం కష్టమని కార్మిక సంఘాలు సూచిస్తున్నాయి.

RTC LOSS DUE TO PRIVATE ILLIGAL TRANSPORT
ఆర్టీసీ ఆదాయానికి 'ప్రైవేటు' పంక్చర్

ఆర్టీసీ ఆదాయానికి 'ప్రైవేటు' పంక్చర్

అంతంత మాత్రం ఆదాయంతో నెట్టుకొస్తోన్న ఆర్టీసీ రథచక్రాలకు.... విచ్చల విడిగా పెరుగుతున్న ప్రైవేటు రవాణా పంక్చర్‌ చేస్తోంది. ఆటోలు, టాక్సీలు..... ఇతర ప్రైవేటు ఆపరేటర్లు ప్రయాణికులను పరిమితికి మించి రవాణా చేస్తూ ఆర్టీసీకి రావాల్సిన ఆదాయాన్ని.. తమ జేబుల్లో వేసుకుంటున్నాయి. ఆర్టీసీ బస్టాపులు, బస్టాండ్ ప్రాంగణాల్లోకి వచ్చి మరీ ప్రయాణికులను తమ వాహనాల్లో ఎక్కించుకుని వెళ్తున్నారు. ఆర్టీసీకి ప్రధానంగా.... హైదరాబాద్‌ వంటి దూర ప్రాంత సర్వీసుల నుంచే ఆదాయం ఎక్కువగా వస్తుంది. ఐతే..ఇటీవల తెలంగాణ ఆర్టీసీతో కుదుర్చుకున్న ఒప్పందం వల్ల గతంలో తిప్పుతున్న 370 సర్వీసులు తగ్గిపోయాయి. ఇదే సమయంలో.... ప్రైవేటు సర్వీసులు గణనీయంగా పెరిగాయి. ఇప్పటికే తిప్పుతున్న 750 ప్రైవేటు సర్వీసులకు.... అదనంగా మరిన్ని రోడ్డెక్కాయి. ప్రైవేటు యజమానులు.... కాంట్రాక్ట్ క్యారేజీలుగా పర్మిట్లు పొంది స్టేజీ క్యారేజీలుగా తిప్పుతూ ఆర్టీసీ ఆదాయానికి బ్రేకులువేస్తున్నారు. ఐతే..ప్రైవేటు ట్రావెల్స్‌పై తనిఖీలు చేస్తూనే ఉన్నామని, ఫిర్యాదులు వస్తే... సత్వరమే స్పందిస్తున్నామని.... రవాణాశాఖాధికారులు చెప్తున్నారు.

ప్రైవేటు పోటుతో.... రోజుకుసుమారు 4 కోట్లు వరకు ఆర్టీసీ నష్టపోతోందని అంచనా. ఈ విషయాలన్నింటిపై ఆర్టీసీ... కార్మిక సంఘాలు సీఎం జగన్​కు లేఖ రాశాయి. హైదరాబాద్ మార్గంలో తగ్గించుకున్న 370 దూర ప్రాంత సర్వీసుల్ని ఇతర ప్రాంతాలకు నడపడం ద్వారా... ఆదాయాన్ని పెంచేలా చేయాలని కోరుతున్నారు. దీనిపై స్పందించిన ఆర్టీసీ ఎండీ ఎం.టి.కృష్ణబాబు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు.

గ్రామీణ ప్రాంతాల్లోనూ ఆటోలు, టాక్సీల్లో పరిమితికి మించి ప్రైవేటు రవాణాను మరింతగా కట్టడి చేయాల్సిన అవసరం ఉందని రవాణా రంగ నిపుణులు సూచిస్తున్నారు.

ఇదీ చదవండి:

దారి చూపుతున్న పల్లె 'వెలుగు'

ABOUT THE AUTHOR

...view details