తెలంగాణ ఆర్టీసీ సమ్మె మరో మలుపు తిరిగింది. ఐకాస కన్వీనర్ అశ్వత్థామరెడ్డి, కో కన్వీనర్ రాజిరెడ్డి దీక్ష విరమించారు. సడక్ బంద్ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. సమ్మె యథాతథంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. హైకోర్టు తీర్పు అందిన తర్వాత సమ్మె కొనసాగింపుపై మంగళవారం సాయంత్రం నిర్ణయం తీసుకుంటామన్నారు.
దీక్ష విరమించిన తెలంగాణ ఆర్టీసీ ఐకాస కన్వీనర్ - ashwathama reddy on cm kcr
తెలంగాణ ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వత్థామరెడ్డి, కో కన్వీనర్ రాజిరెడ్డి దీక్ష విరమించారు. కోర్టు తీర్పును గౌరవించి సడక్ బంద్‌ను వాయిదా వేస్తున్నట్లు అశ్వత్థామరెడ్డి ప్రకటించారు. మంగళవారం నాటి నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయని వెల్లడించారు. ఆర్టీసీ సమ్మెపై తుది నిర్ణయం మంగళవారం సాయంత్రం ప్రకటిస్తామని తెలిపారు.
rtc-jac-leaders-ashwathama-reddy-and-raji-reddy-three-days-fast-end