ఆర్టీసీ అభివృద్ధికి, రాష్ట్ర ప్రజలకు మెరుగైన సేవల కోసం కృషి చేశానని ఆర్టీసీ మాజీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్ అన్నారు. ఆర్టీసీ ఎండీ నుంచి ఏపీఎస్పీ బెటాలియన్ ఏడీజీగా బదిలీ అయిన ఆయన.. గత ఆరు నెలల్లో చేపట్టిన ప్రాజెక్టుల వివరాలను సోమవారం విజయవాడలో విలేకరుల సమావేశంలో వివరించారు. తన బదిలీ ఉత్తర్వులు వచ్చాయని తెలిసిందన్న ఆయన... ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా పని చేశాననే సంతృప్తి కలిగిందని తెలిపారు. కొవిడ్ ప్రత్యేక పరిస్థితుల్లో డిజిటల్ చెల్లింపులకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చేలా చర్యలు తీసుకున్నామని... దీంతో మంచి ఫలితాలు వచ్చాయని అన్నారు. సంస్థ ఉద్యోగులను వైరస్ బారిన పడకుండా చూడగలిగామని వివరించారు.
'నా 26 ఏళ్ల కెరీర్‌లో అనేక ఉన్నత పదవులు అధిరోహించా. ఈ రోజుకూ ఎక్కడా సొంతంగా ఫ్లాట్ లేని అధికారిని అని గర్వంగా చెప్పగలను. ఆర్టీసీ ఎండీగా 6 నెలల్లో అనేక కొత్త ఆలోచనలను తెరపైకి తెచ్చా. ఇంతలో బదిలీ అయింది. సీఎం ఏ దృష్టితో బదిలీ చేశారో తెలియదు. ఆయన కోణం వేరేలా ఉండొచ్చు. ఆ నిర్ణయాన్ని స్వీకరించి, పాటించాలి. గత వారం కొవిడ్ నిర్ధారణ పరీక్షల కోసం ఆర్టీసీ బస్సులను ‘సంజీవిని’గా మార్చి ఆరంభించాం. అది చూసి వైఎస్ విజయమ్మ మెచ్చుకుని మర్నాడు నాకు వైఎస్‌ఆర్ జయంతి కేకు పంపారు. అదేరోజు రాత్రి నాకు బదిలీ ఉత్తర్వులు వచ్చాయి’ - మాదిరెడ్డి ప్రతాప్, ఆర్టీసీ మాజీ ఎండీ
అది నాకు పునర్జన్మ...