ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఆర్టీసీలో ఉద్యోగాల పేరిటి...రూ.57 లక్షలు స్వాహా - ఆర్టీసీ జాబ్​ స్కామ్

ఆర్టీసీలో ఉద్యోగాలిప్పిస్తామని నిరుద్యోగులను మోసంచేశారు... ఇద్దరు ఆర్టీసీ ఉద్యోగులు. మాయమాటలు చెప్పి తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాలకు చెందిన 16 మంది నుంచి రూ.57 లక్షలు వసూలు చేశారు. తీరా ఉద్యోగాలు రాకపోవటంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు నిందుతులను అరెస్టు చేశారు.

ఆర్టీసీలో ఉద్యోగాల పేరిటి...రూ.57 లక్షలు స్వాహా
ఆర్టీసీలో ఉద్యోగాల పేరిటి...రూ.57 లక్షలు స్వాహా

By

Published : Jul 9, 2020, 2:56 AM IST

ఆర్టీసీలో ఉద్యోగాలిప్పిస్తామంటూ మాయమాటలు చెప్పి నిరుద్యోగులను మోసం చేసిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆర్టీసీలోనే పనిచేస్తున్న రవికుమార్, బ్రహ్మారావు.. తమ సంస్థలో ఉద్యోగాలిప్పిస్తామంటూ తూర్పుగోదావరి, కృష్ణాజిల్లాలకు చెందిన 16 మంది నుంచి 57 లక్షల రూపాయల వసూలు చేశారు. నెలలు గడిచినా ఉద్యోగం రాకపోవటంతో బాధితులు వారిని నిలదీశారు.

నిరుద్యోగులకు నకిలీ నియామక పత్రాలు, గుర్తింపుకార్డులు ఇచ్చి కొంతకాలం వారిని మభ్యపెట్టినా చివరకు బాధితులు పోలీసులకు ఫిర్యాదుచేయడంతో అసలు విషయం బయటపడింది. రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని.. వారి నుంచి రూ. 15 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చదవండి :'వైఎస్​ఆర్​ హయాంలోనే ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం రద్దు'

ABOUT THE AUTHOR

...view details