సంక్రాంతి పండుగ సందర్భంగా టీఎస్ ఆర్టీసీ నడిపిన ప్రత్యేక బస్సుల ద్వారా సంస్థకు రూ.3.30 కోట్ల ఆదాయం వచ్చినట్లు ఆర్టీసీ అధికారులు అంచనా వేస్తున్నారు. 2,200 ప్రత్యేక బస్సులను ఆర్టీసీ నడిపించింది. ఒక్కో బస్సుకు సుమారుగా రూ.15వేల వరకు ఆదాయం వచ్చినట్లు అధికారులు లెక్కలు వేస్తున్నారు.
వాస్తవానికి సంక్రాంతికి టీఎస్ ఆర్టీసీ 4,981 ప్రత్యేక బస్సులను నడపాలని ప్రణాళికలు వేసింది. అందులో తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు 3,380 బస్సులు, ఆంధ్రప్రదేశ్‌కు 1,600 బస్సులు నడిపించాలని అధికారులు నిర్ణయించారు. కానీ.. కొవిడ్-19 కారణంగా... ప్రయాణికుల రద్దీ తక్కువగా ఉండడంతో కేవలం 2,200 ఆర్టీసీ బస్సులను మాత్రమే నడిపినట్లు వెల్లడించారు.