ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణలో మరో ఆర్టీసీ డ్రైవర్‌ ఆత్మహత్య - TSRTC Driver death today news

తెలంగాణలో ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో కార్మికుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. మహబుబాబాద్​లో పురుగుల మందు తాగి నరేష్​ అనే డ్రైవర్​ ఆత్మహత్య చేసుకున్నాడు.

ఆర్టీసీ డ్రైవర్‌ ఆత్మహత్య

By

Published : Nov 13, 2019, 12:14 PM IST

తెలంగాణలో మరో ఆర్టీసీ డ్రైవర్‌ ఆత్మహత్య

తెలంగాణలోని మహబూబాబాద్‌లో ఆర్టీసీ డ్రైవర్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వేకువజామున డ్రైవర్ నరేష్‌ పురుగుల మందుతాగి ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించటంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మహబూబాబాద్ ఆర్టీసీ బస్ డిపోలో 2007 నుంచి డ్రైవర్​గా విధులు నిర్వహిస్తున్నాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. విషయం తెలుసుకున్న తోటి ఉద్యోగులు, అఖిలపక్ష పార్టీల కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆస్పత్రికి తరలి వస్తున్నారు. ఆర్టీసీ ఐకాస నేతలు వస్తుండటం వల్ల పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details