ఈ నెలాఖరు వరకు రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సు సర్వీసులు నిలిపివేస్తున్నట్లు మంత్రి పేర్ని నాని తెలిపారు. రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు, ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చే బస్సులను నిలిపివేస్తామన్నారు. ఆటోలు, టెంపోలు నడపవద్దని విజ్ఞప్తి చేశారు. రవాణాకు సంబంధించిన అన్ని వాహనాలు పోలీసులు, రవాణా అధికారుల పర్యవేక్షణ, నియంత్రణలో ఉంటాయని స్పష్టం చేశారు. కరోనా మహమ్మారిని పారదోలేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే విధంగా సహకరించాలని ప్రజలను కోరారు.
ఆర్టీసీ సర్వీసులు ఈ నెలాఖరు వరకు రద్దు: పేర్ని నాని - apsrtc latest news
రాష్ట్రంలో ఆర్టీసీ సర్వీసులను ఈ నెల 31 వరకు రద్దు చేస్తున్నామని మంత్రి పేర్ని నాని ప్రకటించారు. కరోనాను అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. ప్రజలందరూ సహకరించాలని కోరారు.
ఆర్టీసీపై మంత్రి పేర్ని నాని నిర్ణయం