ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రయాణంలో ఉన్న ఆర్టీసీ బస్సుకు ఊడిపోయిన టైర్లు.. డ్రైవర్ అప్రమత్తతో తప్పిన ముప్పు - RTC bus wheels blown off while running at katepally

తెలంగాణ యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూర్ మండలంలోని కాటేపల్లి వద్ద ఆర్టీసీ బస్సుకు ప్రమాదం తప్పింది. రన్నింగ్‌లో ఉండగానే అకస్మాత్తుగా బస్సు చక్రాలు ఊడిపోయాయి. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో బస్సులోని 40 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.

RTC bus wheels blown off while running at katepally yadadri district
RTC bus wheels blown off while running at katepally yadadri district

By

Published : Jul 21, 2021, 11:57 AM IST

తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం కాటేపల్లి వద్ద ఘోర ప్రమాదం తప్పింది. హైదరాబాద్​ నుంచి తొర్రూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు చక్రాలు మార్గమధ్యలోనే ఊడిపోయాయి. గమనించిన డ్రైవర్.. వెంటనే అప్రమత్తమవడంతో ప్రాణనష్టం తప్పింది. ఘటనలో 40 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ​

మరోవైపు కాటేపల్లి నుంచి రాయిపల్లి వైపు రోడ్డు విస్తరణ పనులు కొనసాగుతుండటంతో ఆ మార్గంలో ప్రయాణం సాఫీగా లేదని డ్రైవర్​ తెలిపారు. ఆ కారణంగానే బస్సు ఎడమవైపు చక్రాలు ఊడిపోయాయని పేర్కొన్నారు. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రయాణికులంతా ఊపిరిపీల్చుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details