గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కొలనకొండకు చెందిన వ్యాపారి వెంకటేశ్వరరావు.. గొర్రెల వ్యాపారం చేసేవాడు. మంగళగిరి, నవులూరు, నంబూరు, ఎర్రబాలేనికి చెందిన పెంపకందారుల నుంచి గొర్రెలను కొనుగోలు చేశారు. వాటికి సంబంధించి రూ.40 లక్షలు చెల్లించలేదు. ప్రస్తుతం కనిపించకుండా పోయారని బాధితులు పేర్కొన్నారు. తమను మోసం చేశారని పేర్కొంటూ... బాధితులు తాడేపల్లి పోలీసులను ఆశ్రయించారు. గొర్రెల పెంపకందారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
గొర్రెల పెంపకందారులను మోసగించిన వ్యాపారి.. రూ.40 లక్షలకు టోపీ - tadepalli latest news
అమరావతిలో గొర్రెల పెంపకందారులను ఓ వ్యాపారి మోసం చేశాడు. రూ.40 లక్షల విలువ చేసే గొర్రెలు కొనుగోలు చేసి కనిపించకుండా పోయారని బాధితులు పేర్కొన్నారు. ఈ మేరకు గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేశారు.
గొర్రెల పెంపకందారుల రూ.40 లక్షలకు టోపీ