సాగు చట్టాల రద్దుపై విజయం సాధించిన రైతులకు తెలంగాణ సీఎం కేసీఆర్ అభినందనలు (CM KCR on Three Farmers Law ) తెలిపారు. ఉత్తరాది రైతులు అద్భుత విజయం సాధించారని ప్రశంసించారు. రైతులపై పెట్టిన కేసులను కేంద్రం ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. రైతులకు మద్దతు తెలిపిన వారిపై దేశద్రోహం కేసులు పెట్టారని... అమాయకులపై పెట్టిన దేశద్రోహం కేసులు ఎత్తివేయాలని స్పష్టం చేశారు. రైతుల విషయంలో కేంద్ర చాలా దుర్మార్గంగా వ్యవహరించిందని మండిపడ్డారు. మంత్రులు, పార్టీ నేతలతో సమావేశమైన కేసీఆర్ మీడియాతో (CM KCR Press Meet) మాట్లాడారు.
'ఉద్యమ సమయంలో 700కు పైగా రైతులు ప్రాణాలు కోల్పోయారు. అమరులైన రైతు కుటుంబాలను కేంద్రం ఆదుకోవాలి. అమరులైన రైతు కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం తరఫున రూ.3 లక్షల చొప్పున ఆర్థికసాయం చేస్తాం. రైతులకు సాయం కోసం రూ.22 కోట్లు కేటాయిస్తాం. కేంద్ర ప్రభుత్వం రూ.25 లక్షల చొప్పున ఇవ్వాలి.'