పోలవరం ప్రాజెక్టుకు రూ.1,412 కోట్లు విడుదల - polavaram project news
ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుకు రూ.1,412కోట్లు విడుదల చేస్తూ...రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
పోలవరం ప్రాజెక్టు
పోలవరం ప్రాజెక్టుకు రూ.1,412 కోట్లు విడుదల చేస్తూ... రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో రూ.472 కోట్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొదటి, రెండో, మూడో త్రైమాసికాలకు విడుదల చేసింది. రూ.940 కోట్లను కాల్వలు, డిస్ట్రిబ్యూటరీలు, ప్రాజెక్టు పనులు, పునరావాసం నిమిత్తం విడుదల చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.