రాష్ట్ర మాజీ డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ను ఆర్టీసీ ఎండీగా ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. రవాణా, రహదారులు భవనాల శాఖలో ఆయన సేవల్ని వినియోగించుకునేందుకు బదిలీ చేస్తున్నట్టుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు. 1986 బ్యాచ్‌కు చెందిన ఠాకూర్ ..గతంలో ఏసీబీ డీజీగా పనిచేశారు.
గత ప్రభుత్వ హయాంలో డీజీపీగా ఉన్న ఆయనను వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. ఆ పదవి నుంచి తప్పించింది. ఆ తర్వాత ఆయనను ప్రింటింగ్, స్టేషనరీ కమిషనర్‌గా నియమించింది. ఇప్పుడు ఆర్పీ ఠాకూర్‌ను ఆర్టీసీ ఎండీగా నియమించిన ప్రభుత్వం ప్రింటింగ్, స్టేషనరీ కమిషనర్‌గానూ పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది.