ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ: నాటుబాంబు కలకలం... కూలిన ఇంటి పైకప్పు - జంగంపల్లిలో నాటుబాంబు పేలి కూలిన ఇంటి పైకప్పు

తెలంగాణలోని కామారెడ్డి జిల్లా జంగంపల్లి గ్రామంలో నాటుబాంబు పేలిన ఘటన కలకలం రేపింది. ఈ ప్రమాదంలో ఇంటి పైకప్పు కూలింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

telanagana
telanagana

By

Published : Oct 31, 2020, 4:25 PM IST

తెలంగాణలోని కామారెడ్డి జిల్లా భిక్నూర్​ మండలం జంగంపల్లి గ్రామంలో నాటుబాంబు కలకలం రేపింది. గ్రామానికి చెందిన పుల్లూరు సిద్ధరాములు ఇంట్లో నాటుబాంబు పేలగా ఇంటి పైకప్పు కూలింది. నిషేధిత నాటుబాంబు పదార్థాలు ఉంచడం వల్లే ఘటన చోటు చేసుకుంది.

నాటుబాంబు పేలుడు గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details