అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించిన ఘటన మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లిలో జరిగింది. ఓ కిరాణా దుకాణం షట్టర్ తాళాలు పగలగొట్టి లోనికి చొరబడి రూ.40వేల నగదుతో పాటు దుకాణంలో ఉన్న సుమారు 40 తులాల వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లినట్లు దుకాణ యజమాని భన్వర్ లాల్ తెలిపారు. పక్కనే ఉన్న జై భవాని జ్యూవెల్లరీ దుకాణంలో చోరీ చేసేందుకే గ్రిల్స్‌ను గడ్డపారాలతో తొలగించేందుకు యత్నించగా విఫలం చెందారు. మొత్తం నలుగురు సభ్యుల ముఠా చోరీకి పాల్పడినట్లు సీసీటీవీలో దృశ్యాలు నమోదయ్యాయి. ఘటనపై సమాచారం అందుకున్న పేట్ బషీరాబాద్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
దొంగతనం జరిగిందిలా..