ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Roads: ఆంధ్రాలో ఇలా.. ఒడిశాలో అలా.. - ఏపీలో అద్వాహ్నంగా రోడ్ల దుస్థితి

Roads: రాష్ట్ర సరిహద్దులో ఉన్న ‘ఆంధ్ర-జైపూర్‌’ రహదారి మన రోడ్ల దుస్థితిని ఎగతాళి చేస్తున్నట్లుగా ఉంది. ఎందుకంటే.. ఒడిశాలోని ఈ మార్గం నల్లటి తారుతో, తెల్లటి గీతలతో మెరిసిపోతుంటే.. మన రాష్ట్రంలోకి వచ్చే సరికి దారా.. ఏరా అన్నట్లు నీటితో నిండిన భారీ గుంతలతో ఉంది.

roads in andhra pradesh and way to orissa
ఆంధ్రాలో ఇలా.. ఒడిశాలో అలా..

By

Published : Jul 13, 2022, 8:04 AM IST

Roads: రాష్ట్ర సరిహద్దులో ఉన్న ‘ఆంధ్ర-జైపూర్‌’ రహదారి మన రోడ్ల దుస్థితిని ఎగతాళి చేస్తున్నట్లుగా ఉంది. ఎందుకంటే.. ఒడిశాలోని ఈ మార్గం నల్లటి తారుతో, తెల్లటి గీతలతో మెరిసిపోతుంటే.. మన రాష్ట్రంలోకి వచ్చే సరికి దారా.. ఏరా అన్నట్లు నీటితో నిండిన భారీ గుంతలతో ఉంది. మన రాష్ట్రంలోని సరిహద్దు గ్రామాల ప్రజలు ఆసుపత్రికి చేరుకోవాలన్నా నరకప్రాయంగా మారింది.

మన రాష్ట్రంలోని కామయ్యపేట గ్రామానికి వెళ్లే దారి

ఆంధ్ర- జైపూర్‌ మార్గంలో.. హుకుంపేట మండల కేంద్రం నుంచి కామయ్యపేట గ్రామం వరకు 20కి.మీ. ఉంటే.. అందులో 10కి.మీ. గోతుల మయమైంది. స్థానిక గిరిజనులు నాయకుల దృష్టికి తీసుకెళ్లినా ఎవరూ స్పందించడం లేదు. ప్రస్తుత వర్షాలకు దారి చెరువులా మారింది.

రాష్ట్ర సరిహద్దలో ఒడిశా వెళ్లే మార్గం

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details