Amaravati roads: రాజధాని అమరావతిలో రోడ్ల విధ్వంసం కొనసాగుతూనే ఉంది. తాజాగా లింగాయపాలెం సమీపంలో రైతుల ప్లాట్లలోకి వెళ్లేందుకు వేసిన రహదారిని అక్రమార్కులు తవ్వి మట్టి, కంకరను ఎత్తుకెళ్లారు. ఆదివారం ఈ విషయం తెలుసుకున్న స్థానిక రైతులు ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. సీడ్‌యాక్సెస్ రోడ్డు పక్కన నూతనంగా నిర్మిస్తున్న సీఆర్‌డీఏ కార్యాలయం ముందున్న దారిని తవ్వి మట్టి, కంకరను తరలిస్తున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని అన్నదాతలు మండిపడ్డారు. ఇంతకు ముందు లింగాయపాలెంతో పాటు ఉద్దండరాయునిపాలెం, మందడం గ్రామ పరిధిల్లోని రోడ్లను తవ్విన విషయం తెలిసిందే.
Amaravati roads: అమరావతిలో రోడ్ల విధ్వంసం - గుంటూరు జిల్లాలో రోడ్ల విధ్వంసం
Amaravati roads: రాజధాని అమరావతిలో రోడ్ల విధ్వంసం కొనసాగుతూనే ఉంది. అక్రమార్కులు రోడ్ల నిర్మాణం కోసం వేసిన మట్టి, కంకరును ఎత్తుకెళ్తున్నారు. తాజాగా లింగాయపాలెం సమీపంలో అక్రమార్కులు తవ్వి మట్టి, కంకరను ఎత్తుకెళ్లారు. ఇంతకు ముందు లింగాయపాలెంతో పాటు ఉద్దండరాయునిపాలెం, మందడం గ్రామ పరిధిల్లోని రోడ్లను తవ్విన విషయం తెలిసిందే.
అమరావతిలో రోడ్ల విధ్వంసం