ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Road works slow : కొవిడ్‌, భారీ వర్షాలతో నెమ్మదించిన రోడ్ల పనులు

రాష్ట్రంలో ఎన్​డీబీ రుణంతో చేపడుతున్న రహదారుల పనులు.. కరోనా, భారీ వర్షాల కారణంగా నెమ్మదించాయని అధికారులు తెలిపారు. దీనిపై గుత్తేదారులకు తాఖీదులు ఇచ్చామన్నారు. 9 ప్యాకేజీలకు మార్చిలోనూ, 4 ప్యాకేజీలకు ఏప్రిల్‌లో ఒప్పందం జరిగిందన్నారు.

Road works slow
Road works slow

By

Published : Oct 6, 2021, 2:02 PM IST

న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ (ఎన్‌డీబీ) రుణంతో చేపడుతున్న రహదారుల పనులకు సంబంధించి 6 నెలల్లో పది శాతం పనులు చేపట్టాల్సి ఉన్నా... కొవిడ్‌, భారీ వర్షాలతో ఆ మేరకు జరగలేదని ఆర్‌అండ్‌బీలోని ఎన్‌డీబీ ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. దీనిపై గుత్తేదారులకు తాఖీదులు ఇచ్చామన్నారు. 9 ప్యాకేజీలకు మార్చిలోనూ, 4 ప్యాకేజీలకు ఏప్రిల్‌లో ఒప్పందం జరిగిందన్నారు. గుత్తేదారుల బిల్లులకు ఎన్‌డీబీ రీయింబర్స్‌మెంట్‌ చేసేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బ్యాంకు ఖాతా తెరిచేందుకు సూచనప్రాయంగా అంగీకారం తెలిపినట్లు చెప్పారు. పనులు ఆరంభించిన 146 రోజుల్లో అన్‌కండీషనల్‌ బ్యాంక్‌ గ్యారంటీ సమర్పిస్తే మొబిలైజేషన్‌ అడ్వాన్స్‌ ఇచ్చేందుకు వీలుందని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details