ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

త్వరలో రాష్ట్రంలో రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలు: కృష్ణబాబు - Road repairs and constructions in andhrapradhsh

త్వరలో రాష్ట్రంలో రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలు చేపట్టనున్నట్లు రోడ్లు, భవనాల శాఖ ముఖ్యకార్యదర్శి తెలిపారు. సీఎం సూచనలతో ముందుగా రోడ్ల మరమ్మతులు చేపడతామన్నారు. పనులన్నీ 2022 మే చివరి నాటికి పూర్తయ్యేలా ప్రణాళిక రచించినట్లు కృష్ణబాబు వెల్లడించారు.

త్వరలో రాష్ట్రంలో రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలు
త్వరలో రాష్ట్రంలో రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలు

By

Published : Oct 28, 2021, 11:36 PM IST

రాష్ట్రవ్యాప్తంగా 8 వేల కిలోమీటర్ల మేర రహదారుల మరమ్మతులు, నిర్మాణ ప్రక్రియను నవంబరులో ప్రారంభించనున్నట్టు రహదారులు&భవనాలశాఖ ముఖ్యకార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు తెలిపారు. దీని కోసం ప్రభుత్వం రూ.2,205 కోట్లు కేటాయించిందన్నారు. సీఎం సూచనలతో ముందుగా రోడ్ల మరమ్మతులు చేపడతామని వివరించారు. రోడ్లు బాగు చేసేందుకు నిధులు సమీకరిస్తున్నామని కృష్ణబాబు చెప్పారు.

రూ.923 కోట్లతో, 8,268 కి.మీ రోడ్ల మరమ్మతులకు ప్రణాళికలు రూపొందించినట్లు కృష్ణబాబు తెలిపారు. రూ.1,282 కోట్లతో మేజర్ రోడ్ల మరమ్మతులకు ప్రతిపాదించామన్నారు. ఇప్పటికే కొన్ని పనులకు టెండర్లు ఆహ్వానించామన్న కృష్ణబాబు... 328 రోడ్లకు రూ.604 కోట్ల విలువైన పనులు అప్పగించామన్నారు. మిగతా 819 పనులకు రూ.1,601 కోట్లతో త్వరలో టెండర్లు పిలుస్తామని వివరించారు.

వచ్చే నెల మూడో వారంలోగా రోడ్ల పనులు ప్రారంభిస్తామని తెలిపారు. పనులన్నీ 2022 మే చివరి నాటికి పూర్తయ్యేలా ప్రణాళిక రచించినట్లు కృష్ణబాబు వెల్లడించారు.

ఇవీచదవండి.

ABOUT THE AUTHOR

...view details