ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రక్తమోడిన రహదారులు.. ఇద్దరు మృతి, మరో ఇద్దరికి గాయాలు - road accidents across the state latest news

రాష్ట్రంలో జరిగిన వేరువేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొట్టింది. డ్రైవర్ క్యాబిన్​లో ఇరుక్కున్నాడు. అనంతపురంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బైక్​పై నుంచి లారీ వెళ్లడంతో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.

road accidents in the state
రక్తమోడిన రహదారులు

By

Published : Mar 17, 2021, 11:49 PM IST

కారు ఢీకొనడంతో..

కర్నూలు జిల్లా కోవెలకుంట్ల మండలం కలుగొట్ల వద్ద ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొనడంతో బాలయేసు (50) అనే వ్యక్తి మృతి చెందాడు. రేవనూరులో కూలి పని చేసుకుని కలుగొట్లకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. కారు ఢీకొన్న వెంటనే బాలయేసు అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య వెంకటేశ్వరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

లారీ కింద పడి..

అనంతపురం నగరంలోని ఆర్ట్స్ కళాశాల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. గ్యాస్ సిలెండర్ల లోడుతో వెళ్తున్న లారీ అతనిపై నుంచి దూసుకెళ్లడంతో అతను మృతిచెందాడు. ప్రమాదంలో మృతుడి ముఖం ఛిద్రం కావడంతో పోలీసులకు గుర్తుపట్టడానికి వీలు కాలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు.

క్యాబిన్​లో ఇరుక్కున్న డ్రైవర్..

తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొట్టడంతో డ్రైవర్ క్యాబిన్​లో ఇరుక్కున్నాడు. తీవ్ర గాయాలతో రక్తస్రావం అయిన డ్రైవర్​ను దాదాపు 40 నిమిషాలు శ్రమించి రహదారి భద్రతా సిబ్బంది బయటకి తీశారు. అనంతరం క్షతగాత్రున్ని జగ్గంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసునమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కాలు నుజ్జు నుజ్జు..

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో ఆదోని -మంత్రాలయం జాతీయ రహదారిపై ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొనగా... మల్లికార్జున రెడ్డి అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదంలో కాలు లారీ కింద పడి నుజ్జునుజ్జయింది. గాయపడిన వ్యకిని చికిత్స కోసం ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

డబ్బుల కోసం తండ్రిని హతమార్చి.. ఆత్మహత్యగా చిత్రీకరించి

ABOUT THE AUTHOR

...view details