హైదరాబాద్ ఉప్పల్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఓ లారీ బీభత్సం సృష్టించింది. అతివేగంతో డీసీఎంను వెనకనుంచి ఢీకొట్టింది. లారీ ఢీకొనడంతో డీసీఎం వ్యాన్ అదుపుతప్పి ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. ప్రమాద సమయంలో ద్విచక్రవాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు.
హైదరాబాద్ ఉప్పల్లో లారీ బీభత్సం.. ఒకరు మృతి - ఉప్పల్లో గుడిని ఢీకొట్టిన లారీ
లారీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా హైదరాబాద్ ఉప్పల్ పీఎస్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఓవర్ స్పీడ్తో వచ్చిన లారీ డీసీఎం వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. అక్కడితో ఆగకుండా పక్కనే ఉన్న ఆంజనేయ స్వామి ప్రహరీని కూడా ఢీకొట్టింది. ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా, నలుగురికి గాయాలయ్యాయి.
హైదరాబాద్ ఉప్పల్లో లారీ బీభత్సం
లారీ ఢీకొన్న వేగానికి హనుమాన్ ఆలయం ప్రహరిగోడను సైతం కూలిపోయింది. ఇదే సమయంలో ప్రమాదానికి గురైన లారీని వెనకనుంచి మరో మినీ లారీ ఢీకొట్టింది. మినీ లారీలో ఉన్న నలుగురికి గాయాలవ్వగా చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ఇవీ చూడండి: జనసేన లీగల్ సెల్ అడ్వైజర్ రేగు మహేశ్వరరావుపై హత్యాయత్నం..