తెలంగాణలోని వరంగల్ గ్రామీణ జిల్లా దామర మండలం పెసరకొండ క్రాస్ రోడ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో వరంగల్ అర్బన్ జిల్లా పోచమ్మ మైదాన్‌కు చెందిన ఐదుగురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఎదురుగా వస్తున్న లారీ, కారును వేగంగా ఢీ కొట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధరించారు. ఈ ఘటనలో కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతిన్నది.
తెలంగాణ: పెసరకొండ వద్ద రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి - telanagana news
తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ గ్రామీణ జిల్లా దామరమండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ, కారు ఢీకొన్న ఘటనలో ఐదుగురు యువకులు అక్కడిక్కడే మృతి చెందారు.
పెసరకొండ వద్ద రోడ్డు ప్రమాదం
కాళేశ్వరం నుంచి వరంగల్ వైపుగా వస్తున్న ఇసుక లారీ వరంగల్ నుంచి పరకాల వైపు వెళ్తున్న ఢీ కొట్టింది. వరంగల్‌లో పుట్టిన రోజు వేడుకలకు హాజరై... పరకాల వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుల్లో మేడి పవన్ కుమార్, మేకల రాకేష్, మేడి చందు, రోహిత్, సాబీర్‌గా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను శవ పరీక్షల నిమిత్తం వరంగల్ ఎంజీఎం మార్చురీకి తరలించారు.
Last Updated : Sep 2, 2020, 10:45 AM IST