Road Accident at Gannavaram: కృష్ణాజిల్లా గన్నవరం ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. ఏపీ జెన్కో ఉద్యోగి వరప్రసాద్ కుటుంబంతో సహా రాజమండ్రిలో శుభకార్యానికి వెళ్లి తిరిగి విజయవాడ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. లారీని వెనకనుంచి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వరప్రసాద్ భార్య ఘటనాస్థలంలోనే మృతి చెందింది. మెుత్తం కారులో ముగ్గురు ప్రయాణిస్తుండగా.. వరప్రసాద్‌కు స్వల్ప గాయాలయ్యాయి. మరో మహిళకు ఎడమ చేయి విరిగి తీవ్ర గాయాలు కాగా 108 వాహనంలో కామినేని హాస్పిటల్‌కి తరలించారు.
గన్నవరంలో రోడ్డు ప్రమాదం, లారీని ఢీ కొట్టిన కారు, ఒకరు మృతి - కృష్ణా జిల్లా వార్త
Road Accident శుభకార్యానికి వెళ్లి వస్తుండగా అపశృతి చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొనడంతో ఓ మహిళ మృతి చెందింది. మరో మహిళకు తీవ్రంగా గాయాలయ్యాయి.
లారీని ఢీ కొట్టిన కారు ఒకరి మృతి
Last Updated : Aug 23, 2022, 3:52 PM IST