KMC Corona: తెలంగాణలోని హనుమకొండ కాకతీయ వైద్య కళాశాలలో కరోనా వైరస్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా మరో ఐదురుగురు విద్యార్థులకు వైరస్ పాజిటివ్ వచ్చింది. శనివారం కాకతీయ వైద్య కళాశాలలో వైద్య విద్యార్థులకు పరీక్షలు చేయగా... వారిలో 17 మందికి కరోనా పాజిటివ్‌గా గుర్తించినట్లు కళాశాల ప్రిన్సిపల్ తెలిపారు.
వీరిలో కొందరు ఇళ్లకు వెళ్లిపోగా... మరికొందరు హాస్టల్‌లోనే హోం ఐసొలేషన్‌లో ఉన్నట్లు తెలిపారు. హనుమకొండ, మహబూబాబాద్ జిల్లాలో కరోనా కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. గత రెండు రోజుల్లోనే హనుమకొండలో 99, మహబూబాబాద్‌లో 75 కేసులు నమోదయ్యాయి.