గుంటూరు జిల్లా వట్టిచెరుకూరులో రాజధాని రైతులకు మద్దతుగా చేపట్టిన రిలే నిరాహారదీక్ష నాలుగో రోజుకు చేరింది. ఈ దీక్షకు మాజీ మంత్రి మాకినేని పెదరత్తయ్య మద్దతు తెలిపారు. రాజధానిలో నిర్మించిన భవనాలు తాత్కాలికమని కొందరు అంటున్నారని.. అవన్నీ అబద్ధాలేనన్నారు. వందేళ్లు నిలిచిపోయేలా భవనాలు నిర్మించినట్లు మాజీ మంత్రి తెలిపారు. విశాఖపట్నంలో ఉన్న ఐటీ సంస్థలను బయటకు పంపించారని... అక్కడ సచివాలయం ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందన్నారు.
అమరావతిలో అన్నీ ఉన్నాయి.. ఇంక విశాఖ ఎందుకు? - అమరావతి కోసం రిలే నిరాహారదీక్షలు తాజా వార్తలు
పరిపాలనకు అవసరమైన అన్ని భవనాలు అమరావతిలో ఉన్నాయని.. ఇంక విశాఖను రాజధాని చేయాల్సిన అవసరం ఏముందని.. మాజీ మంత్రి పెదరత్తయ్య ప్రశ్నించారు. వట్టిచెరుకూరులో రిలే నిరాహార దీక్షలకు మద్దతు తెలిపారు.
వట్టిచెరుకూరులో అమరావతికి మద్దతుగా రిలే నిరాహార దీక్షలు