ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

బ్లాక్​లో రైల్వే​ టికెట్లు... వెయ్యికిపైగా స్వాధీనం - రైల్వే పోలీసులు దాడులు

రైలు టికెట్లు బ్లాక్​లో అమ్ముతున్న వారిపై ఆ శాఖ పోలీసులు దాడులు చేశారు. 1,046 టికెట్లు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.14.51 లక్షలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

బ్లాక్​లో రైల్వే​ టికెట్లు.. వెయ్యికిపైగా స్వాధీనం

By

Published : Oct 29, 2019, 7:05 PM IST

బ్లాక్​లో రైల్వే​ టికెట్లు.. వెయ్యికిపైగా స్వాధీనం

రైల్వే రిజర్వేషన్ టికెట్లు బ్లాక్​లో విక్రయిస్తున్న వారిపై ఆర్పీఎఫ్​ పోలీసులు దాడులు నిర్వహించారు. రూ.14 లక్షల 51 వేలు విలువైన టికెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఆర్పీఎఫ్​ ముఖ్య రక్షణ విభాగం కమిషనర్ ఈశ్వరరావు ఆధ్వర్యంలో ఈ దాడులు చేశారు. అప్పటికప్పుడు ప్రయాణం చేసేందుకు అమ్ముతున్న 206 టికెట్లు, తర్వాత రోజుల్లో ప్రయాణం కోసం బుక్ చేసుకున్నవి 840తో కలిపి... మొత్తం 1,046 టికెట్లు స్వాధీనం చేసుకున్నారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఏకకాలంలో దాడులు చేశారు. దాదాపు 25 మంది కమీషన్​ ఏజెంట్లపై... 24 కేసులు నమోదు చేసినట్లు ఈశ్వరరావు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details