Ram gopal Varma comments on kodali nani: ఏపీ మంత్రి కొడాలి నాని ఎవరో తనకు తెలియదని.. కేవలం సినిమా హీరో నాని మాత్రమే తనకు తెలుసని ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ అన్నారు. సినిమా టికెట్ ధరలపై తాను అడిగిన ప్రశ్నలకు కొడాలి నాని ఇచ్చిన కౌంటర్‌పై స్పందించాలని కొందరు కోరుతున్నారని ట్వీట్ చేశారు. తనకు నేచురల్ స్టార్ నాని ఒక్కడే తెలుసని.. కొడాలి నాని ఎవరో తెలియదంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
Ram gopal Varma: కొడాలి నాని ఎవరో నాకు తెలియదు: ఆర్జీవీ
14:43 January 05
నాకు తెలిసిన నాని.. న్యాచురల్ స్టార్ నాని ఒక్కడే: ఆర్జీవీ
‘‘ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ ధరల విషయంపై నేను ప్రభుత్వాన్ని అడిగిన ప్రశ్నలకు సంబంధించి ఎవరో కొడాలి నాని అనే వ్యక్తి ఇచ్చిన కౌంటర్‌కి సమాధానం చెప్పమని కొందరు నన్ను అడుగుతున్నారు. నాకు తెలిసిన నాని సినిమా హీరో.. నేచురల్ స్టార్ నాని ఒక్కడే. వాళ్ళు చెప్తున్న కొడాలి నాని ఎవరో నాకు తెలియదు" - ఆర్జీవీ , ప్రముఖ దర్శకుడు
నాడు మంత్రి అనిల్.. నేడు ఆర్జీవీ
‘శ్యామ్‌సింగరాయ్’ సినిమా రిలీజ్ సమయంలో టికెట్ ధరలపై హీరో నాని చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. దానిపై స్పందించిన మంత్రి అనిల్‌కుమార్ యాదవ్.. ‘‘నాకు కొడాలి నాని ఒక్కరే తెలుసు. ఈ నాని ఎవరో నాకు తెలీదు’’ అన్నారు. ఇప్పుడు ఇదే తరహాలో ఆర్జీవీ కౌంటర్ ఇవ్వడం ఆసక్తిగా మారింది.
ఇదీ చదవండి:
rgv comments : పవన్‌కు, సంపూర్ణేష్‌కు తేడాలేదా..? మంత్రి పేర్ని నానికి ఆర్జీవీ కౌంటర్!