రాష్ట్రంలో రేపు జరగనున్న రాజీవ్ గాంధీ విజ్ఞాన, సాంకేతిక విశ్వవిద్యాలయం(ఆర్జీయూకేటీ) ఉమ్మడి ప్రవేశ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు కన్వీనర్ హరినారాయణ ప్రకటించారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నివర్ తుపాన్ ప్రభావం దృష్ట్యా పరీక్షను డిసెంబర్ 5వ తేదీ ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట మధ్య నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. హాల్ టికెట్లు, పరీక్షా కేంద్రాల కేటాయింపులో ఎలాంటి మార్పు లేదని వెల్లడించారు. పరీక్ష సమయానికి 2గంటల ముందుగా అభ్యర్థులంతా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. రాష్ట్రానికి సంబంధించి 86,617మంది ఈ పరీక్షకు హాజరుకానుండగా మొత్తం 630 కేంద్రాలను ఏర్పాటు చేశారు.
నివర్ ఎఫెక్ట్: ఆర్జీయూకేటీ ఉమ్మడి పరీక్ష వాయిదా - ఆర్జీయూకేటీ ఉమ్మడి పరీక్ష వాయిదా తాజా వార్తలు
నివర్ తుపాన్ ప్రభావంలో ఆర్జీయూకేటీ ఉమ్మడి పరీక్ష వాయిదా పడింది. తుపాన్ ప్రభావం దృష్ట్యా పరీక్షను డిసెంబరు 5వ తేదీన నిర్వహిస్తున్నట్లు కన్వీనర్ హరినారాయణ ఓ ప్రకటనలో తెలిపారు.
rgukt