గణేశ్ నిమజ్జనంపై తీర్పును పునఃపరిశీలించాలని హైకోర్టులో(high court) జీహెచ్‌ఎంసీ(GHMC) కమిషనర్ లోకేశ్ కుమార్ రివ్యూ పిటిషన్(review petition) దాఖలు చేశారు. తీర్పులో 4 అంశాలు తొలగించాలని కోరారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్(pop) విగ్రహాలపై నిషేధం ఎత్తివేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. హుస్సేన్‌సాగర్, జలాశయాల్లో నిమజ్జనంపై నిషేధం ఎత్తివేయాలని కోరారు. ట్యాంక్‌బండ్‌పై నిమజ్జనానికి అనుమతించాలని కోరారు.
ఉత్తర్వులు సవరించాలి
కృత్రిమ రంగుల్లేని విగ్రహాలనే అనుమతించాలని హైకోర్టు స్పష్టం చేయగా.. ఆంక్షలు తొలగించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ విజ్ఞప్తి చేశారు. రబ్బరు డ్యాం నిర్మాణ ఉత్తర్వులు సవరించాలని విన్నవించారు. రబ్బరు డ్యాం నిర్మాణానికి కొంత సమయం అవసరమని... ట్యాంక్‌బండ్‌కు అనుమతించకపోతే.. నిమజ్జనం పూర్తికి ఆరు రోజులు పడుతుందన్నారు. నగరంలో వేలసంఖ్యలో భారీ విగ్రహాలు ఉన్నాయని.. అందుకు తగినన్ని నీటి కుంటలు లేవని హైకోర్టు దృష్టికి తెచ్చారు.