ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Water Dispute between Telugu States : గెజిట్ నోటిఫికేషన్​ అమలుపై నేడు కీలక సమీక్ష - గెజిట్ నోటిఫికేషన్​ అమలుపై కీలక సమీక్ష

కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల(Krishna River Management Board, Godavari River Management Board) పరిధి గెజిట్ నోటిఫికేషన్ అమలుపై నేడు కీలక సమీక్ష నిర్వహించనున్నారు. కేంద్ర జలవనరుల విభాగం అదనపు కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ ఈరోజు హైదరాబాద్​లో.. రెండు బోర్డుల ఛైర్మన్లతో భేటీ కానున్నారు. నోటిఫికేషన్ అమలు కార్యాచరణ పురోగతిపై ఈ సమీక్షలో చర్చించనున్నారు.

http://10.10.50.85:6060///finalout4/andhra-pradesh-nle/finalout/07-October-2021/13283968_tg.jpg
http://10.10.50.85:6060///finalout4/andhra-pradesh-nle/finalout/07-October-2021/13283968_tg.jpg

By

Published : Oct 7, 2021, 12:11 PM IST

కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల(Krishna River Management Board, Godavari River Management Board) పరిధి గెజిట్ నోటిఫికేషన్ అమలుపై నేడు కీలక సమీక్ష జరగనుంది. రెండు బోర్డులతో కేంద్ర జలవనరుల విభాగం అదనపు కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ ఇవాళ హైదరాబాద్​లో సమావేశం కానున్నారు. కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ ఛైర్మన్లు.. ఎంపీసింగ్, చంద్రశేఖర్ అయ్యర్, బోర్డుల కార్యదర్శులు, సభ్యులతో జరిగే ఈ సమావేశంలో.. నోటిఫికేషన్ అమలు కార్యాచరణ పురోగతిని సమీక్షిస్తారు.

కేంద్ర జలశక్తిశాఖ జులై 15న జారీ చేసిన నోటిఫికేషన్.. ఈ నెల 14 నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. ఈలోగా అందుకు సంబంధించిన మొత్తం ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంది. అయితే.. రెండు రాష్ట్రాల నుంచి పూర్తి సమాచారం ఇంకా బోర్డులకు అందలేదు. నిర్వహణకు కావాల్సిన సమాచారం కూడా ఇవ్వలేదు. నోటిఫికేషన్​లోని కొన్ని ప్రాజెక్టులను రెండో షెడ్యూల్ నుంచి తొలగించాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలూ కోరుతున్నాయి.

ఇలాంటి పరిస్థితుల్లో.. గెజిట్ నోటిఫికేషన్ అమలు కార్యాచరణ పురోగతిపై సమీక్షించేందుకు కేంద్ర జలవనరుల విభాగం అదనపు కార్యదర్శి హాజరవుతుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. అమలు కార్యాచరణ దిశగా ఇప్పటి వరకు జరిగిన కసరత్తు ఎంత? రెండు రాష్ట్రాల నుంచి వచ్చిన సమాచారం ఎంత? అంతిమంగా చేయాల్సింది ఏంటి? అనే అంశాలపై దేబశ్రీ ముఖర్జీ.. బోర్డులతో పూర్తి స్థాయిలో సమీక్షిస్తారు. అనంతరం కేంద్ర జలశక్తిశాఖకు నివేదిక సమర్పిస్తారు.

ABOUT THE AUTHOR

...view details