2020లో నమోదుచేసిన కేసులపై బుధవారం అవినీతి నిరోధక శాఖ (అనిశా) వార్షిక నివేదికను వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి కేసుల్లో ఏసీబీకి చిక్కుతున్నవారిలో రెవెన్యూ శాఖ ఉద్యోగులే ఎక్కువగా ఉంటున్నారు. ప్రజల నుంచి లంచాలు తీసుకుంటూ ఈ ఏడాది 62 మంది ప్రభుత్వోద్యోగులు పట్టుబడగా.. వారిలో 28 మంది ఈ శాఖ వారే. 14400 టోల్‌ఫ్రీ నెంబర్‌కు వచ్చిన ఫిర్యాదులపై అత్యధిక శాతం కేసులు చేపట్టినట్లు ఏసీబీ వెల్లడించింది.
అవినీతిలో రెవెన్యూదే అగ్రస్థానం పెరిగిన ఆకస్మిక తనిఖీలు
2019తో పోలిస్తే 2020లో ఏసీబీ నమోదు చేసిన మొత్తం కేసుల సంఖ్య పెరిగింది. 2019లో ఏసీబీ మొత్తంగా 199 కేసులు నమోదు చేయగా.. ఈ ఏడాది 321 కేసులు నమోదుచేసింది. ఉచ్చు (ట్రాప్), అక్రమాస్తుల కేసుల సంఖ్య గతేడాది పోలిస్తే కొంత తగ్గింది. అదే సమయంలో ఆకస్మిక తనిఖీలు, సాధారణ విచారణలు పెరిగాయి.
- 2019లో 96 ఉచ్చుకేసులు నమోదు కాగా ఈ ఏడాది 62 నమోదయ్యాయి. అక్రమాస్తుల కేసులు గతేడాది 23 నమోదు కాగా.. ఈ ఏడాది 14 నమోదయ్యాయి.
- ఆకస్మిక తనిఖీలు 2019లో 40 మాత్రమే జరగ్గా ఈ ఏడాది 97 జరిగాయి.
ఇదీ చదవండి:
'న్యాయమూర్తుల బదిలీలతో ఆయనపై కేసుల విచారణలో జాప్యం జరగొచ్చు'