తమ పొలాన్ని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకుంటూ బోర్డు ఏర్పాటు చేశారని, ఆ భూమి స్వాధీనం చేసుకుంటే ఆత్యహత్య శరణ్యమని గుంటూరు జిల్లా కాకుమాను మండలం కొమ్మూరుకి చెందిన రైతు జిలానీ కుటుంబం పురుగు మందు డబ్బాలతో ఆ పొలంలో కూర్చున్నారు. గతంలో ఆర్మీలో ఉద్యోగం చేసిన వారికి భూమిని ఇవ్వగా వారు ఆ భూమిని తమకు విక్రయించారని జిలానీ చెప్పారు. తన పేరు మీద, భార్య, అత్తయ్య పేరు మీద ఎన్నో ఏళ్ల క్రితం 1.78 సెంట్లు భూమిని కొనుగోలు చేశామని, పాసు పుస్తకాలు కూడా ఇచ్చారని... ఆ పొలానికి శిస్తు కూడా చెల్లిస్తున్నట్లు జిలానీ తెలిపారు. ఇప్పుడు రెవెన్యూ అధికారులు పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే తలంపుతో... తమ పొలాన్ని అక్రమంగా స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ప్రభుత్వ స్థలమంటూ రెవెన్యూ అధికారులు పొలంలో బోర్డు ఏర్పాటు చేశారన్నారు. కనీసం తమకు చెప్పకుండా ఇలా బోర్డు పెట్టడం ఏమిటని... మా భూమి మాకు కావాలని లేకపోతే ఆత్మహత్య చేసుకోక తప్పదంటున్నారు ఆ కుటుంబసభ్యులు.
'మా భూమి తీసుకుంటే ఆత్మహత్యే శరణ్యం..!'
తమ భూమి తీసుకుంటే ఆత్మహత్యే శరణ్యమని గుంటూరు జిల్లా కొమ్మూరులో ఓ రైతు కుటుంబం పురుగు మందు డబ్బాలతో పొలంలో కూర్చుని నిరసన తెలిపారు. పేదలకు ఇళ్ల స్థలాల ఇచ్చేందుకు తమ భూమిని రెవెన్యూ అధికారులు అక్రమంగా స్వాధీనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
మా భూమి తీసుకుంటే...ఆత్మహత్యే శరణ్యం