రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు ఆలోచన లేదని ఉపముఖ్యమంత్రి,రెవెన్యూ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ తెలిపారు.స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతే దీనిపై ప్రభుత్వం ఆలోచన చేస్తుందని చెప్పారు.ఉగాది నుంచి ఇవ్వనున్న ఇళ్ల పట్టాల కోసం ఈ నెల17వ తేదీ నుంచి జిల్లాల వారీగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్టు మంత్రి వెల్లడించారు.రాష్ట్రంలో భూముల రీసర్వే కోసం రూ.1800కోట్లు ఖర్చు చేస్తున్నట్లు పేర్కొన్నారు.భూముల సర్వే కోసం విదేశాల్లో అమలవుతున్న విధానాలను పరిశీలించేందుకు,అధికార్లను పంపే ఆలోచన చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
కొత్త జిల్లాల ఆలోచన లేదు: మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్
రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు ఆలోచన ఇప్పుడే లేదని రెవెన్యూశాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ తెలిపారు. ఇళ్ల పట్టాల కోసం ఈ నెల 17 నుంచి జిల్లాల వారీగా రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.
కొత్త జిల్లాల ఏర్పాటు ఆలోచన లేదు:సుభాష్ చంద్రబోస్