తహసీల్దార్ల కార్యాలయాలపై అనిశా వరుస దాడులపై రెవెన్యూ ఉద్యోగుల సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి ఆ సంస్థ బాధ్యులు ప్రకటన విడుదల చేశారు. రోజువారీ విధులకు సంబంధించి సోదాలు చేయడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరి తప్పులను వ్యవస్థకు ఆపాదించడం సరికాదని రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ బాధ్యులు బొప్పరాజు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. సంబంధం లేని అంశాల ప్రస్తావనతో ఉద్యోగుల్లో అభద్రతా భావం పెరుగుతోందని వివరించారు. పని ఒత్తిడి తీవ్రమైనా.. సిబ్బంది సంఖ్య పెరగలేదని బొప్పరాజు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.
'తహసీల్దార్ల కార్యాలయాలపై అనిశా వరుస దాడులు సరికాదు'
తహసీల్దార్ల కార్యాలయాలపై అనిశా వరుస దాడులపై రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. కొందరి తప్పులను వ్యవస్థకు ఆపాదించడం సరికాదని అభిప్రాయపడింది. పని ఒత్తిడికి తగ్గట్టు సిబ్బంది సంఖ్య పెరగలేదని రెవెన్యూ ఉద్యోగుల సంఘం బాధ్యులు బొప్పరాజు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.
అనిశా వరుస దాడులపై రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అభ్యంతరం