భూముల రీసర్వే పూర్తి అయ్యే వరకూ రెవెన్యూ ఉద్యోగులకు ఇతర విధులు కేటాయించొద్దని రెవెన్యూ ఉద్యోగుల సంఘం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ను కలిసిన ఉద్యోగుల సంఘం వినతి పత్రం అందించింది. సిబ్బంది లేక క్షేత్రస్థాయిలో రెవెన్యూ ఉద్యోగులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని ఆ సంఘం అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు మంత్రికి తెలిపారు. మరోవైపు క్రమశిక్షణా చర్యలకు గురైన ఉద్యోగులపై శాఖాపరమైన విచారణ పూర్తి చేయకుండా కాలయాపన చేయడం తగదని మంత్రికి విన్నవించారు.
'భూముల రీసర్వే పూర్తయ్యేవరకు అదనపు విధులు వద్దు' - రీసర్వేపై రెవెన్యూ ఉద్యోగుల లెటర్
భూముల రీసర్వే పూర్తయ్యే వరకూ రెవెన్యూ ఉద్యోగులకు ఇతర విధులు కేటాయించవద్దని కోరుతూ రెవెన్యూ ఉద్యోగుల సంఘం ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ను కలిసి వినతిపత్రం అందించారు. క్రమశిక్షణా చర్యలకు గురైన ఉద్యోగులపై విచారణ తొందరగా పూర్తి చేయాలని కోరారు. విచారణలో కాలయాపన చేయడం తగదని మంత్రికి విన్నవించారు. ఉద్యోగులు పదవీ విరమణ చేసినా విచారణలు పూర్తికాకపోవడంతో పింఛన్లు అందడంలేదని ఉద్యోగులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
ఉద్యోగ విరమణ చేసినా విచారణలు పూర్తి కాకపోవటంతో పింఛన్లు కూడా రాని పరిస్థితి నెలకొందని రెవెన్యూ ఉద్యోగుల సంఘం వినతి పత్రంలో పేర్కొంది. ఉద్యోగులపై క్రమశిక్షణా చర్యల్లో భాగంగా చేపట్టిన విచారణలు త్వరితగతిన పూర్తి చేయాలని కోరింది. అదే సమయంలో తహసీల్దార్లకు తరచూ నిధుల కొరత ఏర్పడుతోందని.. ప్రభుత్వం పూర్తిస్థాయిలో నిధులు ఇవ్వకపోవటం వల్ల వివిధ పథకాల అమలు, కార్యాచరణ విషయంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని రెవెన్యూ ఉద్యోగుల సంఘం మంత్రికి తెలియజేసింది.
ఇదీ చదవండి :వరద బాధితులకు తక్షణమే సాయం అందించండి: సీఎం జగన్