ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Sep 24, 2020, 6:50 PM IST

ETV Bharat / city

'తహసీల్దార్లకు జీతాలు చెల్లించని కలెక్టర్లకూ వేతనాలు ఆపాలి'

బదిలీ ఆయిన తహసీల్దార్లకు జీతాలు చెల్లించని కలెక్టర్లకూ జీతాలు ఆపాలని.. రెవెన్యూ ఉద్యోగుల సంఘం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్​ను కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేసింది.

Revenue Employees association meet deputy cm krishnadas
రెవెన్యూ ఉద్యోగుల సంఘం

బదిలీ ఆయిన తహసీల్దార్లకు జీతాలు చెల్లించని కలెక్టర్లకూ జీతాలు ఆపాలని.. రెవెన్యూ ఉద్యోగుల సంఘం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఇటీవల కొన్ని జిల్లాల్లో పనిచేసిన తహసీల్దార్ల బదిలీల్లో సాంకేతిక కారణాల వల్ల జీతాలు రాకపోవటంపై రెవెన్యూ ఉద్యోగుల సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్​ను కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేసింది. వంద మందికిపైగా తహసీల్దార్లకు జీతాలు అందటంలేదని.. వారికి తక్షణం చెల్లింపులు జరిపేలా చూడాలని రెవెన్యూ ఉద్యోగుల సంఘం విజ్ఞప్తి చేసింది. అవసరమైతే కలెక్టర్లకు జీతాలు ఆపాలని.. తహసీల్దార్​లకు మాత్రం జీతాలు ఆపొద్దని రెవెన్యూ సంఘం తన విజ్ఞప్తిలో పేర్కొంది. సాంకేతిక కారణాలతో జీతాలను నిలిపివేస్తే.. సదరు ఎమ్మార్వోలు వాటి కోసం సచివాలయం చుట్టూ తిరగాల్సి ఉంటుందని రెవెన్యూ ఉద్యోగుల సంఘం స్పష్టం చేసింది.

ABOUT THE AUTHOR

...view details