రెవెన్యూ లోటు భర్తీ కింద ఆంధ్రప్రదేశ్‌కు 491.41 కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి 15వ ఆర్థిక సంఘం చేసిన సిఫార్సులను అనుసరించి దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాలకు కలిపి జూన్‌కు 6,154.77 కోట్ల రూపాయలు విడుదల చేసింది. ఇందులో కేరళకు అత్యధికంగా 1,276.91 కోట్ల రూపాయలు విడుదలయ్యాయి.
రెవెన్యూ లోటు కింద ఏపీకి 491 కోట్ల రూపాయలు విడుదల - revenue deficit budget release news
రెవెన్యూ లోటు కింద 13 రాష్ట్రాలకు కేంద్రం నిధులు విడుదల చేసింది. కేరళ రాష్ట్రానికి అత్యధికంగా నిధులు విడుదలైనట్లు అధికారులు వెల్లడించారు.
రెవెన్యూ లోటు భర్తీ నిధులు విడుదల