ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సీబీఐ విచారణ కోరుతూ ప్రధానికి ఎంపీ రేవంత్​రెడ్డి లేఖ

మల్కాజిగిరి ఎంపీ రేవంత్​రెడ్డి ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే శ్రీశైలం దుర్ఘటన జరిగిందని.. దీనిపై సీబీఐతో విచారణ జరిపించాలంటూ ఆయన కోరారు. బాధిత కుటుంబాలకు కోటి రూపాయలు ఆర్థిక సహాయం ఇచ్చేట్లు చర్యలు తీసుకోవాలని ప్రధానిని కోరారు.

revanth-reddy
revanth-reddy

By

Published : Aug 24, 2020, 4:58 PM IST

తెలంగాణ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే శ్రీశైలం దుర్ఘటన జరిగిందని, ఆ ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌ రెడ్డి లేఖ రాశారు. ప్రమాద సంకేతాలపై సిబ్బంది ముందస్తుగా లేఖ రాసినా ఉన్నతాధికారులు సకాలంలో స్పందించలేదని ఆయన లేఖలో పేర్కొన్నారు. శ్రీశైలం డ్యాం భద్రత, విద్యుత్ ప్లాంట్ నిర్వహణ లోపాలపై కొన్నేళ్లుగా ఆందోళనలు నెలకొని ఉన్నట్లు రేవంత్‌ రెడ్డి లేఖలో వెల్లడించారు.

విద్యుత్ ప్లాంట్​లోని సిబ్బంది అభ్యంతరాలు, ఆందోళనలను కేసీఆర్ ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని రేవంత్​రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల తొమ్మిది మంది ప్రాణాలతో పాటు రూ. వేల కోట్ల విలువైన జాతి సంపద అగ్నికి ఆహుతైందని... ఈ ఘటనపై నిస్పాక్షిక విచారణ జరగాలని విజ్ఞప్తి చేశారు. సీబీఐ విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని లేఖలో ఎంపీ తెలిపారు. బాధిత కుటుంబాలకు కోటి రూపాయలు ఆర్థిక సహాయం ఇచ్చేట్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని ప్రధానిని కోరారు.

ABOUT THE AUTHOR

...view details