ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

REVANTH REDDY: 'మంత్రి మల్లారెడ్డి భూ అక్రమాలపై ఆధారాలున్నాయి' - రేవంత్​రెడ్డి తాజా వార్తలు

తెలంగాణ మంత్రి మల్లారెడ్డి భూ అక్రమాలపై తనవద్ద ఆధారాలు ఉన్నాయని రేవంత్​రెడ్డి అన్నారు. గిఫ్ట్ డీడ్‌ చూపించి మల్లారెడ్డి వర్శిటీకి అనుమతి తెచ్చుకున్నారని వివరించారు. రెండుసార్లు అమ్మిన భూమిని చూపి వర్శిటీకి ఎలా అనుమతి తెచ్చుకున్నారని ప్రశ్నించారు.

REVANTH ON MALLAREDDY
REVANTH ON MALLAREDDY

By

Published : Aug 27, 2021, 7:27 PM IST

తెలంగాణ మంత్రి మల్లారెడ్డి భూ అక్రమాలపై తనవద్ద ఆధారాలు ఉన్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌ చుట్టుపక్కల భూములు కొనుగోలు చేస్తే సేల్‌డీడ్‌ చేయాల్సిందేనని గుర్తు చేశారు. గిఫ్ట్ డీడ్‌ చూపెట్టి మల్లారెడ్డి వర్శిటీకి అనుమతి తెచ్చుకున్నారని వివరించారు. 16 ఎకరాలకు మల్లారెడ్డి బావమరిది ఎలా యజమాని అయ్యారో వివరాలు లేవన్నారు.

తెలంగాణ మంత్రి మల్లారెడ్డిపై రేవంత్​ రెడ్డి వ్యాఖ్యలు

గుండ్ల పోచంపల్లి గ్రామంలో 650 సర్వే నెంబరులో ఉన్న భూమి 22 ఎకరాల 20గుంటలు. తాజాగా ధరణి వివరాల ప్రకారం.. 33 ఎకరాల 26 గుంటలు అయింది. ఇది ఏమైనా కేసీఆర్‌ నాటిన మొక్కా.. పెరిగి పెద్దది అవ్వడానికి? ఇందులో 16 ఎకరాలు మల్లారెడ్డి బావమరిది శ్రీనివాస్‌ పేరు మీద ఉంది. ఈ భూమిలోనే మల్లారెడ్డి ఎడ్యుకేషనల్‌ సొసైటీ పేరుపై గిఫ్ట్‌ డీడ్‌ పెట్టి, యూనివర్సిటీకి అనుమతి తీసుకున్నారు. 2004లో ఇదే భూమిని గ్రామ పంచాయతీ లేఅవుట్‌లుగా అమ్మారు. ఆ తర్వాత మళ్లీ హెచ్‌ఎండీఏ పేరుతో ఇదే భూమిని లేఅవుట్‌లు వేసి విక్రయించారు. 650 సర్వే నెంబర్‌లో లేఔట్‌లు చేసి, రెండుసార్లు ప్లాట్లు అమ్మారు. అమాయక ప్రజలు ప్లాట్లు కొనుగోలు చేసిన తర్వాత 22 ఎకరాలు కాస్తా.. 33 ఎకరాలు ఎలా అయింది? అందులో 16 ఎకరాలు శ్రీనివాస్‌రెడ్డికి ఎలా వచ్చింది? దీని వెనుకున్న అక్రమాలపై పాత్రికేయ మిత్రుల ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్‌గారి దృష్టికి తీసుకొస్తున్నా. మీ మంత్రివర్గంలో నీతి, నిజాయతీ కలిగిన వాళ్లుగా చెబుతున్న వీరు ఈ అక్రమాలు ఎలా చేశారో చెప్పాలి. అంతేకాదు, జవహర్‌నగర్‌లో ఉన్న ఐదెకరాల ప్రభుత్వ భూమిలో రిజిస్ట్రేషన్ నిషేధించిన తర్వాత భూమి ఎలా బదిలీ అయ్యింది? గజ దొంగలను పక్కన పెట్టుకుని... కేటీఆర్ నీతులు చెబుతున్నారు. ఫీజు రీయంబర్స్‌మెంట్‌లో వందల కోట్ల దుర్వినియోగం జరిగినట్టు విజిలెన్స్‌ నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక బయట పెట్టాలి’ - రేవంత్​రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు

మల్లారెడ్డి తప్పుడు పత్రాలతో వర్శిటీకి అనుమతి తెచ్చుకున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వభూమిలో మల్లారెడ్డి సీఎంఆర్‌ ఆస్పత్రి కట్టారని ఆరోపించారు.భూ అక్రమాలకు పాల్పడిన మల్లారెడ్డి మంత్రిగా ఎలా ఉంటారని నిలదీశారు.

ఇవీ చూడండి:Krishna Tribunal: 'కృష్ణా ట్రైబ్యునల్‌'పై సుప్రీంలో వేసిన తెలంగాణ పిటిషన్‌ 'విత్‌డ్రా'కు అడ్డంకి

ABOUT THE AUTHOR

...view details