తెలంగాణ రాష్ట్రంలోని మూడుచింతలపల్లిలో ప్రజలు వ్యవసాయం మీదే ఆధారపడి జీవనం సాగిస్తున్నారని పీసీసీ అధినేత రేవంత్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి దత్తత తీసుకున్న గ్రామంలో పేదలకు ఇచ్చిన హామీల ఇప్పటి వరకు నెరవేర్చలేదని విమర్శించారు. నాలుగేళ్ల క్రితం గ్రామంలో పేదలందరికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, కమ్యూనిటీ హాళ్లు నిర్మిస్తానని సీఎం హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. సీఎం దత్తత తీసుకున్న గ్రామానికి ఇచ్చిన అన్ని హామీల్లో ఒక్కటైనా నెరవేర్చారా అని ప్రశ్నించారు. హామీలు పూర్తి చేసి ఉంటే బొడ్డురాయి దగ్గరే చర్చపెడదామన్నారు. హామీలు పూర్తి చేసినట్లు నిరూపిస్తే ముక్కు నేలకు రాసి ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు రేవంత్ రెడ్డి.
మంత్రి మల్లారెడ్డిపై విమర్శలు..
మంత్రి మల్లారెడ్డికి యూనివర్శిటీకి ఇచ్చిన భూమిపై పీసీసీ అధ్యక్షుడు సంచలన ఆరోపణలు చేశారు. తప్పుడు పత్రాలతో మల్లారెడ్డి వర్శిటీకి అనుమతి తెచ్చుకున్నారని తెలిపారు. మల్లారెడ్డి భూ అక్రమాలపై సీఎం కేసీఆర్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.మల్లారెడ్డి నిర్దోషి అని తేలితే తాను ఏ శిక్షకైనా సిద్ధమని రేవంత్‌రెడ్డి ప్రకటించారు
పోరాటం ఆగదు..