తెలంగాణ నాగర్‌కర్నూల్ జిల్లాలో కాంగ్రెస్ నేతల కల్వకుర్తి ఎత్తిపోతల పర్యటన ఉద్రిక్తతకు దారితీసింది. ఎత్తిపోతలలో భాగంగా.... ఎల్లూరు వద్ద మొదటి లిఫ్ట్‌లోని పంప్ హౌస్ ముంపునకు గురైంది. మూడో మోటార్ సిమెంట్ బేస్ దెబ్బతినటంతో పంప్ హౌజ్‌లోకి నీరు చేరింది.
కల్వకుర్తి ఎత్తిపోతల వద్ద ఉద్రిక్తత... రేవంత్‌రెడ్డికి గాయం - telangana news
తెలంగాణ నాగర్‌కర్నూల్ జిల్లాలో కాంగ్రెస్ నేతల కల్వకుర్తి ఎత్తిపోతల పర్యటన ఉద్రిక్తతకు దారితీసింది. ముంపునకు గురైన ప్రాంతాన్ని పరిశీలించేందుకు వెళ్లిన కాంగ్రెస్ నేతలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది.
ముంపునకు గురైన ప్రాంతాన్ని పరిశీలించేందుకు వెళ్లిన ఎంపీ రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ నేతలు మల్లు రవి, సంపత్‌లను పోలీసులు అనుమతించలేదు. లిఫ్టు వద్దకు ఎవరూ వెళ్లకుండా బందోబస్తును ఏర్పాటు చేశారు. అయినా... ప్రాజెక్టు సందర్శనకు వెళ్లేందుకు నాయకులు యత్నించటంతో... పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, కాంగ్రెస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది.
ఈ క్రమంలో రేవంత్ కాలికి స్వల్పంగా గాయమైంది. అనంతరం ఆయనతో పాటు మల్లురవి, సంపత్‌కుమార్‌లను అదుపులోకి తీసుకున్న పోలీసులు.... అచ్చంపేట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతోనే పంప్‌హౌజ్ దెబ్బతిన్నదని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు.